లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి రామకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 16: ప్రముఖ చిత్రకారుడు, గుంటుపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేసే చిత్రకళా ఉపాధ్యాయుడు ఎ రామకృష్ణ పేరు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థ బెంగుళూరులో 2010 మే 20న చిత్రకళా పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న రామకృష్ణ కేవలం 13గంటల వ్యవధిలో 100 తైలవర్ణ చిత్రాలను చేతివేళ్లతో గీసి రికార్డు సృష్టించారు. ఈసందర్భంగా తాజాగా వచ్చిన లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్ట్ఫికెట్‌ను రామకృష్ణకు బుధవారం పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలో ప్రిన్సిపాల్ టి అలివేణి అందజేశారు.